కథ వేరుంటాది కుర్రాడా ?
on Mar 13, 2025
బిగ్ బాస్ హౌస్ లో "కథ వేరుంటాది" అనే ఊత వాక్యంతో బాగా పాపులర్ అయ్యాడు సయ్యద్ సోహైల్. హౌస్ లో కొంచెం రొమాంటిక్ గా, అగ్రెసివ్ గా , మంచిగా టాస్కులు ఆడుతూ ఉండేవాడు. అలాంటి సోహైల్ కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఫుల్ అప్డేట్ గా ఉంటున్నాడు. రకరకాల ఫోటో షూట్స్ తో అలాగే వేరే ప్లేసెస్ కి వెళ్తూ ఫొటోస్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఫుడ్ వండుతూ కూడా వీడియోస్ ని స్టేటస్ గా పెడుతూ ఉంటాడు. ఐతే సయ్యద్ ఒక్కసారిగా చాలా క్యూట్ గా ట్రాన్సఫార్మ్ ఐపోయాడు.
ఇప్పుడు సోషల్ మీడియాలో సయ్యద్ లుక్ చూసి నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. సోహైల్ "బూట్ కట్ బాలరాజు, మిస్టర్ ప్రెగ్నెంట్ , లక్కీ లక్ష్మణ్" లాంటి మూవీస్ లో నటించాడు. ఇక కొన్ని నెలల క్రితం కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. ఐతే కొంత కాలం క్రితం తన మూవీస్ ని చూడాలంటూ సయ్యద్ సోహైల్ ఆడియన్స్ ని కోరాడు. కానీ మూవీస్ తనకు కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక సయ్యద్ కి అఖిల్ సార్థక్, విజె సన్నీ, మెహాబుబ్ దిల్ సే వీళ్లంతా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా..వీళ్ళు కూడా బుల్లితెర మీద వాళ్ళ సత్తా చాటుతూ ఉంటారు. ఇప్పుడు సోహైల్ కొత్త లుక్ లో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు.. ఇన్నాళ్లు పెంచిన గడ్డాన్ని తీసేసరికి ఎవరీ కొత్త హీరో అని అందరూ అనుకునేలా ఉన్నాడు. ఇక నెటిజన్స్ ఐతే ఈ కొత్త లుక్ కి ఫిదా ఐపొతూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ లుక్ లో కదా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
